పవిత్ర పదాలు.
దివ్య చిత్రాలు

చిత్ర గీత

book (1)
గీత సరళీకృతం

గీత యొక్క లోతైన జ్ఞానాన్ని జీవితానికి అన్వయించే ఆలోచనామృతం

thinking
దృశ్య వివరణలు

గీతలోని ప్రతి శ్లోకం ఒక సున్నితమైన, ఆధ్యాత్మికమైన దృష్టాంతాన్ని వివరించే దృశ్య కావ్యం

search (1)
గొప్ప వ్యాఖ్యానం

అంతర్దృష్టితో కూడిన వివరణలు ప్రాచీన జ్ఞానాన్ని సులభతరం చేస్తాయి మరియు స్పష్టం చేస్తాయి.

loyalty-program
పరిపూర్ణ బహుమతి

అన్ని వయసుల పాఠకుల మనసులలో తత్త్వ విచేచన కలిగించి కలకాలం నిలిచిపోయే స్ఫూర్తిదాయకమైన బహుమతి.

ఓం నమో భగవతే వాసుదేవాయ !

పుస్తకం గురించి

శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందం నుండి వెలువడిన వేదోపనిషత్తుల సారమైన భగవద్గీత జ్ఞానం సాధకులకు సులభంగా అందించే లక్ష్యంతో ప్రముఖ చిత్రకారుడు శ్రీ నీలి వేంకటరమణ గారు 2010లో చిత్రలేఖన ప్రయాణం ప్రారంభించారు. 2017 గీతాజయంతి నాటికి, భగవద్గీతలోని 162 శ్లోకాలకు అద్భుతమైన చిత్రాలను రూపొందించి, శ్రీ జంపన శ్రీనివాస సోమరాజు గారి వ్యాఖ్యానంతో “భగవద్గీత భావచిత్రనుధ” గ్రంథాన్ని జిజ్ఞాసువులకు అందించారు.

బాలలు సులభంగా భగవద్గీతను అధ్యయనం చేయడానికి వీలుగా, 2019 గీతాజయంతి నాటికి “బాలల భగవద్గీత” ప్రచురించబడింది. ఈ గ్రంథం బాలలకు సరళమైన, దృశ్యాత్మక రూపంలో గీతా బోధనలను అందిస్తుంది. అదే విధంగా, గానగంధర్వుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారు ఆలపించిన గీతలోని 106 శ్లోకాలకు శ్రీ నీలి వేంకటరమణ గారి చిత్రాలతో కూడిన వీడియో రూపొందిచబడింది. ఇది యువత మరియు బాలలకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

గీతాజయంతి: సౌర్య దివస్

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, 2021 ఆగస్టు 9న భాగ్యనగరంలో శ్రీశ్రీశ్రీ గోవిందగిరి మహరాజ్ గారి అధ్యక్షతన దక్షిణ భారత పీఠాధిపతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, భగవద్గీత జ్ఞానాన్ని యువతకు చేరువ చేసి, వారిని ధైర్యవంతులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. గీతాజయంతిని “సౌర్య దివస్” (ధైర్యవంతుల పండుగ)గా జరుపుకోవాలని, ఉదయం పెద్దలు 700 శ్లోకాలను, సాయంత్రం యువత “గీతా చాలీసా” (40 శ్లోకాలు)ను సామూహికంగా పారాయణం చేయాలని తీర్మానించారు. ఈ నిర్ణయానుసారం, 2021 డిసెంబరు 14న భాగ్యనగరంలో లక్షమంది యువతతో “లక్షయువగళ గీతార్చన” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

యువతకు గీతా జ్ఞానం

భగవద్గీత ద్వారా యువతలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రగిలించడం మరియు భారత భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేయడమే ఈ ప్రయత్నాల లక్ష్యం. ఈ దిశగా, VGS పబ్లిషర్స్ ఈ గ్రంథాలను ముద్రించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మీ కాపీని ఆర్డర్ చేయడానికి ఈ నంబర్లకు సంప్రదించండి: 0866-2512222, 0866-2510202, లేదా vgsbooklinks@gmail.com కు ఇమెయిల్ చేయండి.

భగవద్గీత యొక్క దృశ్య కళాఖండం భగవద్గీత భావచిత్రసుధ ఈరోజే మీ కాపీని పొందండి

పూర్తి రంగుల చిత్రాలతో రూపొందించి, అందంగా బైండ్ చేయబడి 2017లో గీతాజయంతి నాడు విడుదలై ఆధ్యాత్మిక ప్రియులకు మార్గదర్శిగా నిలిచింది.

వేల. 750

భగవద్గీత భావచిత్రసుధ

(ఐదు ప్రతుల బాక్స్ 5 × 450 = 2,250)

వేల. 360

బాలల భగవద్గీత

(పది ప్రతుల బాక్స్ 10 × 200 = 2,000)

వేల. 25

భగవద్గీత చిత్రామృతము

(వంద ప్రతుల బాక్స్ 100 × 20 = 2,000)

Rs. 25

Bhagavad Gita For Life & Beyond

(Box 100 × 20 = 2,000)

భగవద్గీత వీడియో గ్యాలరీ

Playlist

18 Videos
అన్ని వయసుల వారికి శాశ్వతమైన ఆధ్యాత్మిక మార్గదర్శి మరియు పరిపూర్ణ బహుమతి.

ప్రతి శ్లోకం అందంగా దృశ్యమానం చేయబడింది. తెలుగు మరియు ఆంగ్ల భాషలలో స్పష్టమైన వివరణలతో రూపొందింపబడినది.

Telugu Book
English Book
Hindi Book

ఏదైనా ప్రశ్న ఉందా? మమ్మల్ని సంప్రదించండి

Scroll to Top